Andhra Pradesh: ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా విడుదల.. ట్విట్టర్ లో స్పందించిన నారా లోకేశ్!

  • సినిమా అపూర్వ విజయం అందుకుంది
  • మామయ్యకు, చిత్ర యూనిట్ కు అభినందనలు
  • ఎన్టీఆర్ టీడీపీతో చరిత్ర సృష్టించారని వ్యాఖ్య

ఎన్టీఆర్ జీవితంపై క్రిష్ తెరకెక్కించిన ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సినిమా ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అన్నివర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం అపూర్వ విజయం అందుకుందని లోకేశ్ కితాబునిచ్చారు.

ఈరోజు ఉదయం ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘సామాన్య కుటుంబంలో జన్మించి వెండితెర ఇలవేల్పుగా ఎదిగి, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి చరిత్ర సృష్టించిన తాతగారి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'కథానాయకుడు' సినిమా ఈరోజు విడుదలై అపూర్వ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మామయ్య బాలకృష్ణకు, చిత్ర బృందానికి అభినందనలు’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
Balakrishna
Tollywood
ntr katha nayakudu
Telugudesam
Talking Movies
  • Loading...

More Telugu News