రాకేశ్ ఓ ఫైటర్... నాకు తెలుసు ఆయన కేన్సర్‌ను జయిస్తారు!: హృతిక్ రోషన్ కి ప్రధాని ధైర్య వచనాలు
- కేన్సర్ బారినపడిన రాకేశ్ రోషన్
- భయపడొద్దన్న ప్రధాని
- కేన్సర్‌ను జయిస్తారంటూ ట్వీట్
విషయం తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేస్తూ మరేం భయపడాల్సిన అవసరం లేదని, రాకేశ్ రోషన్ ఫైటర్ అని పేర్కొన్నారు. కేన్సర్ నుంచి రాకేశ్ త్వరగానే కోలుకుంటారని, ఆందోళన చెందాల్సిన అసవరం లేదని ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ‘‘ప్రియమైన హృతిక్. రాకేశ్ రోషన్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయనో ఫైటర్. బోల్డంత ధైరం ఉంది. నాకు తెలుసు ఆయన కేన్సర్‌ను జయిస్తారు’’ అని మోదీ ట్వీట్ చేశారు.