India: 2019-20లోనూ ముందుండేది ఇండియానే: ప్రపంచ బ్యాంక్

  • 2019-20 ఆర్థిక వృద్ధి రేటు 7.5 శాతం
  • మరికొన్ని సంవత్సరాలు ఇదే వృద్ధి రేటు
  • రాజకీయ అనిశ్చితి ఏర్పడే అవకాశాలు
  • హెచ్చరించిన వరల్డ్ బ్యాంక్

ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, 2019-20లోనూ తన స్థానాన్ని నిలుపుకోనుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. 2017-18లో నమోదైన వృద్ధి రేటు 6.7 శాతం కాగా, అది ఈ ఆర్థిక సంవత్సరం 7.3 శాతానికి చేరవచ్చని అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్, వచ్చే సంవత్సరం 7.5 శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చని పేర్కొంది. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్ (జీఈపీ)ని విడుదల చేసిన వరల్డ్ బ్యాంక్, మరికొన్ని సంవత్సరాల పాటు ఇండియా ఇదే విధమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందని తెలిపింది.

ఇదే సమయంలో దక్షిణాసియాలో పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేసిన వరల్డ్ బ్యాంక్, రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చని తెలిపింది. ఈ కారణంతో వృద్ధి రేటు మందగించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇక ప్రపంచ సగటు వృద్ధి 2.9 శాతానికి తగ్గనుందని, వచ్చే రెండేళ్లూ 2.8 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. ఉత్పత్తి రంగం నెమ్మదించడమే ఇందుకు కారణమని అభిప్రాయపడింది.

India
World Bank
Growth Rate
  • Loading...

More Telugu News