Washington: కుమార్తెను ఈడ్చుకుంటూ ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్లిన తండ్రి.. వీడియో వైరల్

  • లగేజీని లాక్కెళ్లినట్టు తీసుకెళ్లిన తండ్రి
  • వెనకే అనుసరించిన చిన్నారి సోదరి
  • నడవడం ఇబ్బందిగా అనిపించడం వల్లేనన్న తండ్రి

కుమార్తె హూడీ (స్వెట్టర్ లాంటి వాటికి ఉండే టోపీ లాంటింది) పట్టుకుని లగేజీని ఈడ్చుకెళ్లినట్టు విమానాశ్రయంలో లాక్కెళ్తున్న ఓ తండ్రి వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని వాషింగ్టన్ డ్యూల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. న్యూ ఇయర్ రోజున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. తండ్రి తనను లాక్కెళ్తున్నా ఆ చిన్నారి అరవడం కానీ,  భయపడడం కానీ చేయలేదు. చేతిలో లగేజీతో ఆమె సోదరి వారిని అనుసరిస్తోంది. వీడియో వైరల్ కావడంతో తండ్రి స్పందించాడు. కుమార్తె తన వెనక నడవడం ఇబ్బందిగా అనిపించిందని అందుకే అలా లాక్కెళ్లానని వివరణ ఇచ్చాడు. 

Washington
Dulles International Airport
New Year
dragging
daughter
hoodie
  • Error fetching data: Network response was not ok

More Telugu News