Ali: గుంటూరు సీటు ఇవ్వండి: టీడీపీతో హాస్య నటుడు అలీ

  • 20 ఏళ్లుగా టీడీపీలోనే ఉన్నా
  • పవన్ కల్యాణ్ ఆహ్వానించలేదు
  • వైకాపాలో చేరనున్నానన్న వార్తలు అవాస్తవం
  • మంత్రి గంటాతో అలీ

తాను గడచిన 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నానని, తనకు గుంటూరు నుంచి పోటీ చేయాలని ఉందని హాస్య నటుడు అలీ, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తేల్చి చెప్పారు. నిన్న గంటాను కలిసి దాదాపు గంట పాటు చర్చలు జరిపిన ఆయన, పవన్ కల్యాణ్ పార్టీని పెట్టినా, తననేమీ ఆహ్వానించలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలు కూడా అవాస్తవమని చెప్పారు.

తాను మర్యాదపూర్వకంగానే జగన్, పవన్ లను కలిశానని అన్నారు. తాను చంద్రబాబును కూడా కలిసి, గుంటూరు నుంచి పోటీ చేసే విషయమై మాట్లాడగా, ఆయన భరోసా ఇచ్చారని, మీ తరఫున సహకారం కావాలని గంటాతో భేటీలో అలీ చెప్పినట్టు సమాచారం. గతంలో గంటా ఎన్నికల్లో పోటీ చేసిన వేళ, అలీ స్వయంగా వెళ్లి విస్తృతంగా ప్రచారం చేశారు. 

Ali
Ganta Srinivasa Rao
Telugudesam
Pawan Kalyan
Jagan
  • Loading...

More Telugu News