Nagpur: తన హృదయాన్ని ఓ అమ్మాయి దొంగిలించిందంటూ ఫిర్యాదు.. తలలు పట్టుకున్న పోలీసులు

  • యువకుడి ఫిర్యాదుతో బిత్తరపోయిన పోలీసులు
  • తమ వల్ల కాదని తిప్పి పంపిన వైనం
  • స్వయంగా వెల్లడించిన కమిషనర్

ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులతో చర్చించి తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. ఇంతకీ ఆ యువకుడు ఇచ్చిన ఫిర్యాదేంటో తెలుసా? తన హృదయం కనిపించడం లేదని! దానిని ఓ అమ్మాయి దొంగిలించిందని, వెతికి పెట్టాల్సిందిగా కోరుతూ నాగ్‌పూర్ పోలీసులను ఆశ్రయించాడు.

యువకుడి ఫిర్యాదుతో బిత్తరపోయిన పోలీసులు కాసేపటికి తేరుకున్నారు. అతడిని అక్కడే కూర్చోబెట్టి ఉన్నతాధికారులతో యువకుడి ఫిర్యాదుపై చర్చలు జరిపారు. అతడి ఫిర్యాదును స్వీకరించలేమని వారు చెప్పడంతో తమ వల్ల కాదని యువకుడిని తిప్పి పంపారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ భూషణ్ కుమార్ ఉపాధ్యాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ వస్తువులు పోయాయని, వెతికి పెట్టాలంటూ తమకు రోజూ చాలా ఫిర్యాదులు వస్తాయని తెలిపారు. వాటిని వెతికి వాటి యజమానులకు అప్పగిస్తామని పేర్కొన్న సీపీ.. యువకుడి ఫిర్యాదు గురించి చెప్పారు. తమకు అప్పుడప్పుడు ఇటువంటి ఫిర్యాదులు కూడా వస్తుంటాయన్నారు. అయితే, వాటిని తాము పరిష్కరించలేమని పేర్కొన్నారు.

Nagpur
Maharashtra
Heart
Police
complaint
police commissioner
  • Loading...

More Telugu News