Loksabha: ‘ఈబీసీల రిజర్వేషన్ బిల్లు’కు లోక్ సభ ఆమోదం!

  • బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు
  • వ్యతిరేకంగా 3 ఓట్లు
  • లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటన

‘ఈబీసీల రిజర్వేషన్ బిల్లు’కు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు లభించాయి. దీంతో మూడింట రెండొంతులకు పైగా మెజార్టీతో ఈ బిల్లు ఆమోదం పొందింది.  కాగా, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల బిల్లుపై లోక్ సభలో ఈరోజు ఉదయం నుంచి సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ఈ బిల్లు సవరణకు లోక్ సభ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయించారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల డివిజన్ ఓటింగ్ తప్పనిసరి అని సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. అనంతరం, సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై ఓటింగ్ జరిగింది.

Loksabha
speaker
sumitra mahajan
  • Loading...

More Telugu News