Rana Daggubati: మొన్నే నేనూ.. రానా చర్చించుకున్నాం.. అంతలోనే మోదీ సర్ నిర్ణయం తీసుకున్నారు: హీరో నిఖిల్

  • రానా షోలో మాట్లాడుకున్నాం
  • అద్భుతమైన పనితీరును కనబరిచారు
  • జాతి వివక్షకు నో చెప్పండి

అగ్రవర్ణ పేదలకు ఆర్థిక స్తోమత ప్రాతిపదికగా విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఈ విషయమై సినీ కథానాయకుడు నిఖిల్ స్పందిస్తూ మోదీ నిర్ణయాన్ని అభినందించాడు.

ఇదిలావుంచితే, అయితే ఇటీవల రానా హోస్ట్‌గా నిర్వహిస్తున్న ‘నెం.1 యారీ’ షోలో నిఖిల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రానా, తాను అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై చర్చించుకున్నట్టు నిఖిల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

‘కొన్ని వారాల క్రితం రానా వ్యాఖ్యాతగా వ్యవహరించే షోలో మేం ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కులం, మతం, జాతి గురించి పట్టించుకోకుండా మోదీ సర్‌ దీనిని నిజం చేసి అద్భుతమైన పనితీరును కనబరిచారు. జాతి వివక్షకు నో చెప్పండి’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

Rana Daggubati
Nikhil
Narendra Modi
No.1 Yari
Twitter
  • Loading...

More Telugu News