Chiranjeevi: స్వార్థంతోనే నిర్మాణ సంస్థను స్థాపించా: రామ్ చరణ్

  • ‘సైరా’ రీ షూట్ విషయంలో నిజం లేదు
  • సమస్యలు తలెత్తిన మాట వాస్తవం
  • పెద్ద సినిమాలతో ఇబ్బందులు తప్పవు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ఎంత సక్సెస్‌ను సాధించాడో... నిర్మాతగా కూడా అంతే సక్సెస్‌ను సాధించాడు. నిర్మాతగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన ‘ఖైదీ’ చిత్రం అద్భుత సక్సెస్‌ను సాధించింది. ప్రస్తుతం తిరిగి చిరుతోనే ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే చెర్రీ నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చెర్రీ.. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

తన తండ్రి చిరంజీవితో ఎక్కువ సినిమాలు తీయాలనే స్వార్థంతోనే కొణిదెల నిర్మాణ సంస్థను స్థాపించానని తెలిపాడు. అలాగే ‘సైరా’ సినిమాలో నటిస్తున్నందుకు తన తండ్రికి ఎవరూ ఇవ్వనంత పారితోషికం ఇచ్చానని చెర్రీ తెలిపాడు. అయితే ‘సైరా’ సినిమా రీ షూట్ జరుగుతోందన్న మాటలో నిజం లేదని.. కానీ సమస్యలు తలెత్తిన మాట మాత్రం వాస్తవమన్నారు. ఓ పెద్ద సినిమా చేసే సమయంలో రకరకాల ఇబ్బందులు వస్తూనే ఉంటాయని చెర్రీ వెల్లడించాడు.  

Chiranjeevi
Ramcharan
Khaidi
Syera
Vinaya vidheya Rama
  • Loading...

More Telugu News