paruchuri: రజనీకాంత్ ఆఫర్ ను స్వీకరించలేకపోయాము: పరుచూరి గోపాలకృష్ణ

  • రజనీ మాకు కథ చెప్పారు 
  • డైలాగ్స్ విని అభినందించారు 
  • తెలుగులో 'బాబా'కి మాటలు రాయమన్నారు    

పరుచూరి గోపాలకృష్ణ తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ రజనీకాంత్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. "మోహన్ బాబుగారితో కొన్ని హిట్ సినిమాలకి పనిచేశాము. ఆ తరువాత తన తదుపరి సినిమా కోసం రజనీకాంత్ దగ్గరున్న కథను వినమని ఆయన అన్నారు. రజనీ చెప్పిన కథ విన్నాము .. ఒక సూపర్ స్టార్ రాసిన కథను వినడం చిత్రమైన అనుభూతి .. నిజంగానే చాలా బాగుంది.

ఆ కథతో చేసిన సినిమానే 'రాయలసీమ రామన్న చౌదరి'. ఈ సినిమాలో "మళ్లీ వెంట్రుకలు వస్తాయనే నమ్మకంతో గుండు కొట్టించుకుంటున్నారు గానీ, మళ్లీ వెంట్రుకలు మొలవవంటే తలనీలాలు ఇస్తారా?" వంటి డైలాగ్స్ రజనీకాంత్ కి బాగా నచ్చాయి. ఆ తరువాత ఆయన నాకు ఫోన్ చేసి తన 'బాబా' సినిమాకి తెలుగులో సంభాషణలు రాసిపెట్టమన్నారు. ఇంతవరకూ లిప్పుకి డైలాగ్ రాయడం మాకు తెలియదు సార్ .. క్షమించండి' అన్నాను. అలా రజనీ ఇచ్చిన ఆఫర్ ను స్వీకరించలేకపోయాము" అని అన్నారు. 

paruchuri
rajani
  • Loading...

More Telugu News