Chiranjeevi: దసరా సెలవుల్లో సందడి చేయనున్న 'సైరా'

  • షూటింగు దశలో 'సైరా'
  • వేసవిలో కొరటాలతో సెట్స్ పైకి 
  • ఆ తరువాతే త్రివిక్రమ్ తో  

చిరంజీవి 151వ సినిమాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిరంజీవి ప్రాజెక్టులను గురించి తాజాగా ఆయన స్పందిస్తూ .. "ప్రస్తుతం షూటింగు జరుపుకుంటోన్న 'సైరా'మరో రెండు నెలల్లో షూటింగు పూర్తి చేసుకుంటుంది. దసరా సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాము.

నాన్నగారి కెరియర్లో 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో వున్నాము. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో అనుకున్న ప్రాజెక్టు పట్టాలపైకి వెళుతుంది" అని చెప్పాడు. మొత్తానికి చిరంజీవికి సంబంధించిన ప్రాజెక్టులపై చరణ్ పూర్తి క్లారిటీతో ఉన్నాడనే విషయం అర్థమవుతోంది. ఇక చరణ్ తాజా చిత్రంగా రూపొందిన 'వినయ విధేయ రామ' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందనే సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News