Kurnool District: ఇలాంటి అద్భుత ఘట్టాలు చంద్రబాబు పాలనలోనే సాధ్యమవుతాయి: లోకేష్

  • నూతన విమానాశ్రయం ఏర్పాటుపై లోకేశ్ సంతోషం
  • ఒకప్పుడు కర్నూలు ఫ్యాక్షన్ కు మారుపేరు
  • ఇప్పుడు  అభివృద్ధి జరుగుతోంది

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో నూతన విమానాశ్రయాన్ని సీఎం చంద్రబాబు ఈరోజు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కర్నూలు విమానాశ్రయంలో దిగుతుంటే.. ఒకప్పుడు ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిన ప్రాంతమేనా ఇది అని తనకు అనిపించిందని, ఈ అభివృద్ధిని చూసి తన మనసు పులకించిందని అన్నారు. ఇలాంటి అద్భుత ఘట్టాలు చంద్రబాబుగారి పాలనలోనే సాధ్యమవుతాయని అనిపించిందని లోకేశ్ కొనియాడారు.

  • Loading...

More Telugu News