Andhra Pradesh: జగన్ కు రాజీనామా లేఖ పంపిన ఆదిశేషగిరిరావు.. త్వరలోనే టీడీపీలో చేరే ఛాన్స్!

  • తెనాలి అసెంబ్లీ టికెట్ కోరిన ఆదిశేషగిరిరావు
  • విజయవాడ పార్లమెంటు సీటును సూచించిన జగన్
  • సంక్రాంతి తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న నేత

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఈరోజు ఉదయం ఆయన వైసీపీ అధినేత జగన్ కు రాజీనామా లేఖ పంపారు. గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదిశేషగిరిరావు ఆశించారు. అయితే విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ అధినేత జగన్ సూచించారు.

ఈ నేపథ్యంలో మనస్తాపానికి లోనైన ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. చంద్రబాబుకు కూడా బంధువైన ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరే అవకాశముందని భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఆదిశేషగిరిరావు కృష్ణ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ తరఫున పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి తెదేపాలో చేరడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

Andhra Pradesh
Jagan
YSRCP
Telugudesam
budha venkanna
resign
seshagirirao
tenali
Guntur District
Vijayawada
assembly
parliament
  • Loading...

More Telugu News