Andhra Pradesh: ఏపీ సీఎం చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు.. డీజీపీని కలుసుకున్న బీజేపీ నేతలు!

  • కాకినాడలో సీఎం దురుసుగా ప్రవర్తించారు
  • మహిళా కార్యకర్తను ఫినిష్ చేస్తామన్నారు
  • దాడి చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై బీజేపీ నేతలు ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇటీవల ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించామని ఫిర్యాదులో తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఓ మహిళా కార్యకర్తను ఫినిష్ చేస్తామని సీఎం హెచ్చరించారని పేర్కొన్నారు. సీఎం హెచ్చరికల తర్వాత ఏపీలో బీజేపీ నేతలపై దాడి చేస్తామని హెచ్చరికలు వస్తున్నాయని వాపోయారు. ఈ అన్ని హెచ్చరికలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Andhra Pradesh
Chandrababu
East Godavari District
Telugudesam
DGP
BJP
leaders
  • Loading...

More Telugu News