Andhra Pradesh: ఆ రూ.43,000 కోట్లను వైఎస్ జగన్ ప్రజలకు పంచిపెట్టాలి!: ప్రత్తిపాటి పుల్లారావు
- అమరావతిలో భూములపై చర్చకు రండి
- మోదీ డైరెక్షన్ లోనే వైసీపీ బుక్ రిలీజ్
- వైసీపీ అధినేతపై మండిపడ్డ ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నారన్న ఆరోపణలపై దమ్ముంటే జగన్ చర్చకు రావాలని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. అసలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసిన రూ.43,000 కోట్ల నగదును జగన్ ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ విడుదల చేసిన పుస్తకం అరిగిపోయిన టేప్ రికార్డర్ లాంటిదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్ లోనే జగన్ చంద్రబాబుపై పుస్తకాన్ని అచ్చు వేయించారని ఆరోపించారు. టీడీపీ నేతల తరహాలో తన కుటుంబ ఆస్తులను ప్రకటించే దమ్ము జగన్ కు ఉందా? అని పుల్లారావు ప్రశ్నించారు.