sarita: మోహన్ బాబు అంటే భయం వేసేది: సీనియర్ హీరోయిన్ సరిత

  • మోహన్ బాబు గారు ఆ సినిమాలో విలన్ 
  • ఆయనంటే భయపడేదాన్నని చెప్పాను 
  • మంచి మనసున్నవారాయన   

నటిగా .. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సరిత, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. "మొదటి నుంచి కూడా మోహన్ బాబు గారిని చూస్తే చాలా భయం వేసేది. నేను చేసిన ఒక సినిమాలో మురళీమోహన్ హీరో అయితే మోహన్ బాబుగారు విలన్. ఎందుకో తెలియదుగానీ మోహన్ బాబుగారిని చూస్తేనే భయం వేసేది.

ఒక రేప్ సీన్లో నన్ను ఎత్తి బెడ్ పై పడేశారు. అప్పటి నుంచి ఆయనంటే మరింత భయం పట్టుకుంది. ఆయనలా పడేయడం వలన బ్యాక్ పెయిన్ తో బాధ పడ్డాను .. ఇదంతా ఆయనకి తెలియదు. ఆ తరువాత .. తరువాత ఆయనని చూస్తుంటే ఆయన చాలా మంచిమనసున్న వారని అర్థమైంది. ఇటీవల ఆయనని చూసినప్పుడు, ఈయన గురించా నేను అంతగా భయపడేదానిని అని అనిపించింది. 'మీరంటే నాకు చాలా భయం వేసేదండి' అని ఆయనతో చెప్పాను కూడా" అంటూ నవ్వేశారు.

sarita
mohan babu
  • Loading...

More Telugu News