Andhra Pradesh: స్పందించడానికి ఇది సమయం కాదు... నాగబాబు కౌంటర్ వీడియోలపై నందమూరి బాలకృష్ణ!

  • తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న బాలయ్య
  • అనంతరం మీడియా ప్రతినిధులతో సమావేశం
  • బాలకృష్ణతో పాటు చిత్రయూనిట్ సందడి

మెగాస్టార్ ఫ్యామిలీని విమర్శిస్తూ గతంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నటుడు నాగబాబు ఇటీవల వరుస వీడియోలతో కౌంటర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై మీడియా ప్రతినిధులు బాలయ్యను నేరుగా అడిగేశారు.

ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బయటకు వచ్చిన బాలకృష్ణను నాగబాబు వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు కోరారు. దీంతో ఒక్కసారిగా నవ్వేసిన బాలకృష్ణ..‘ఇప్పుడు సమయం కాదు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం నటి విద్యాబాలన్, హీరో కల్యాణ్ రామ్ తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఇప్పటికే ఐదు వీడియోలు విడుదల చేసిన నాగబాబు, మరో వీడియోను కూడా విడుదల చేస్తానని ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh
Telangana
Balakrishna
nagababu
Viral Videos
counter
  • Error fetching data: Network response was not ok

More Telugu News