sarita: దాసరిగారి వల్లనే డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టాను: సీనియర్ హీరోయిన్ సరిత

  • 4 భాషల్లో 160కి పైగా సినిమాలు
  • అగ్రస్థాయి హీరోల సరసన నటన
  • స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్  

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు కలుపుకుని, 160కి పైగా చిత్రాల్లో సరిత నటించారు. రజనీ.. కమల్ .. శివాజీ గణేశన్ .. రాజ్ కుమార్ వంటి అగ్రకథానాయకుల సరసన నటించారు. ఎంతోమంది కథానాయికలకు ఆమె గాత్రదానం చేశారు. తాను డబ్బింగ్ చెప్పడానికి గల కారణం గురించి ఆమె తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడారు.

"నా వాయిస్ బాగుంటుందని నాకే తెలియదు. 'మరో చరిత్ర' సినిమా సమయంలో డబ్బింగ్ చెప్పడానికి నేను టెన్షన్ పడుతుంటే వేరే వాళ్లతో చెప్పిద్దామనుకున్నారు. కానీ అక్కడున్న ఇంజనీర్ నా వాయిస్ బాగుందని చెప్పి .. నాకు కొంచెం టైమ్ ఇచ్చేలా చేశారు. అలా హీరోయిన్ గా నేను బిజీగా వున్నప్పుడే దాసరి గారు 'గోరింటాకు' సినిమాలో సుజాత గారికి డబ్బింగ్ చెప్పమని అడిగారు. అప్పటి నుంచి డబ్బింగ్ అంటే ఇష్టం పెరిగింది. విజయశాంతి .. రాధ .. సుహాసిని .. నగ్మా .. సౌందర్య వంటి స్టార్  హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పాను" అని అన్నారు.

sarita
  • Error fetching data: Network response was not ok

More Telugu News