Jasprit Bumrah: ఆసీస్, కివీస్ తో వన్డే సిరీస్ కి ఎంపికైన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహ‌మ్మ‌ద్ సిరాజ్‌

  • బుమ్రా స్థానంలో మొహ‌మ్మ‌ద్ సిరాజ్‌
  • బుమ్రాకి విశ్రాంతి
  • కివీస్ తో మూడు టీ20లకి సిద్దార్థ్ కౌల్ ఎంపిక

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కి ఫాస్ట్ బౌలర్ బుమ్రాకి విశ్రాంతి కల్పించారు. బుమ్రా స్థానంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహ‌మ్మ‌ద్ సిరాజ్‌ కి చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వివరాలని పొందుపరిచింది. అలాగే, కివీస్ తో జరగబోయే మూడు టీ20 మ్యాచ్ లకి సిద్దార్థ్ కౌల్ ని జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కాగా, ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో బుమ్రా అద్భుతంగా రాణించి మొత్తం 21 వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే.

Jasprit Bumrah
ODI series
Australia
New Zealand.
Cricket
T20
  • Loading...

More Telugu News