Andhra Pradesh: జనసేనపై తప్పుడు ప్రచారం.. విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదుచేసిన పార్టీ వర్గాలు!

  • కమిషనర్ తో లీగల్ సెల్ సభ్యుల భేటీ
  • దోషులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించిన కమిషనర్

జనసేన పార్టీ సెంట్రల్ లీగల్ కమిటీ సభ్యులు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. కృష్ణా జిల్లాలోని విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ స్థానాలను ఫలానావారికి కేటాయించారంటూ వాట్సాప్, ఇతర ఎలక్ట్రానిక్ మీడియాతో కొందరు తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారనీ, వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు విజయవాడ కమిషనర్ ను కలుసుకున్న జనసేన లీగల్ సెంట్రల్ కమిటీ, కృష్ణా జిల్లా లీగల్ టీమ్ సభ్యులు.. ఫిర్యాదును అందజేశారు. కాగా దోషులపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వీరికి హామీ ఇచ్చారు.

Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
Vijayawada
whatsapp
fake news
Police
commissioner
  • Loading...

More Telugu News