Gujarath: రైలులో గుజరాత్ బీజేపీ నేత దారుణ హత్య!

  • మాజీ బీజేపీ ఉపాధ్యక్షుడు జయంతీలాల్ భానుషలీ
  • అత్యాచార ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా
  • రైల్లో ప్రయాణిస్తుంటే తుపాకి తూటాకు బలి

గుజరాత్‌ కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్‌ భానుషలీ రైలులో ప్రయాణిస్తున్న వేళ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆయన్ను అతి సమీపం నుంచి తుపాకితో కాల్చి చంపారు. భుజ్‌ నుంచి అహ్మదాబాద్‌ వరకూ ప్రయాణించే 'సజయీ నగరీ ఎక్స్‌ ప్రెస్‌'లో ఈ ఘటన గత రాత్రి జరిగింది. గతంలో గుజరాత్‌ రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా, అబుదాస ఎమ్మెల్యేగా పనిచేసిన జయంతీలాల్‌ పై అత్యాచార ఆరోపణలు రాగా, తన పదవికి రాజీనామా చేశారు.

 ఆపై డబ్బు కోసమే తన భార్య ఇలా భానుషలీపై తప్పుడు ఆరోపణలు చేసిందని ఆమె భర్తే స్వయంగా చెప్పడం గమనార్హం. కాగా, ఆయన హత్య విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. వ్యక్తిగత పగతోనే జయంతీలాల్‌ ను హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నా, ఘటనా స్థలిలో ఓ తుపాకీ లభించడంతో, ఆయన తనంతట తానుగా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలోనూ దర్యాఫ్తు సాగుతుందని పోలీసు అధికారి ఒకరు తెలపారు.

Gujarath
BJP
Jayantilal Bhanushali
Murder
Train
  • Loading...

More Telugu News