Hyderabad: సమ్మె షురూ.. హైదరాబాద్ లో కదలని ఆటోలు, క్యాబ్ లు!

  • మొదలైన రెండు రోజుల సార్వత్రిక సమ్మె
  • మద్దతు పలికిన తెలంగాణ మజ్దూర్ యూనియన్
  • క్యాబ్ లు లేక విమాన ప్రయాణికుల ఇబ్బంది

రెండు రోజుల సార్వత్రిక సమ్మె మొదలైంది. ఈ ఉదయం హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లు రోడ్డెక్కలేదు. 2018 ఎంవీ యాక్ట్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ, దేశవ్యాప్తంగా సమ్మెకు పలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 48 గంటల పాటు సమ్మె జరగనుండగా, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్ సంపూర్ణ మద్దతు పలికింది. ఇదే సమయంలో న్యూ డెమోక్రసీ, టీ.మాస్ ఫోరమ్ కూడా సమ్మెకు మద్దతు పలికాయి. దీంతో రెండు రోజుల పాటు ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. క్యాబ్ లు నడవక పోవడంతో విమానాశ్రయానికి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

Hyderabad
Samme
2018 MV Act
Airport
  • Loading...

More Telugu News