Dil Raju: థియేటర్ల వివాదం: 'పేట' నిర్మాత వర్సెస్ తెలుగు నిర్మాత!

  • 18నే ‘పేట’ను విడుదల చెయ్యొచ్చు కదా
  • మూడు పెద్ద తెలుగు సినిమాల విడుదల
  • అనువాద చిత్రాలకు థియేటర్లు ఎలా దొరుకుతాయి?

సినీ నిర్మాతల మధ్య సంక్రాంతి సినిమాల విడుదలపై మాటకు మాట పెరుగుతోంది. థియేటర్ల లభ్యతపై రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. ‘పేట’ ప్రీ-రిలీజ్ వేడుకలో ఆ చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 నుంచి థియేటర్లలో ‘పేట’ మాత్రమే ఉంటుందని అశోక్ అంటున్నారని, అలాంటప్పుడు 18నే ‘పేట’ను రిలీజ్ చేసుకోవచ్చు కదా? అన్నారు.

సంక్రాంతికి మూడు పెద్ద తెలుగు సినిమాలు విడుదలవుతున్నప్పుడు... అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా దొరుకుతాయని ప్రశ్నించారు. తెలుగు సినిమాల విడుదల తేదీలను ఆరు నెలల ముందే ప్రకటించామని.. అశోక్ వ్యాఖ్యలు సమంజసం కావన్నారు. గతేడాది పంపిణీదారుడిగా తాను చాలా డబ్బు పోగొట్టుకున్నానని దిల్ రాజు తెలిపారు.

Dil Raju
Ashok
Peta
Sankranthi
Pre release event
  • Loading...

More Telugu News