Telugudesam: మా ఎంపీపై సస్పెన్షన్ వేటు వేయడం దారుణం: సుజనా చౌదరి

  • ప్రజాస్వామ్యంలో ఏమీ అడగకూడదా?
  • సభ నడపడం కూడా ప్రభుత్వానికి చేతకావట్లేదు
  • టీడీపీపై కేంద్ర ప్రభుత్వ ఆరోపణలు తగదు

ఏపీ పునర్విభజన చట్టం హామీలు అమలు చేయాలంటూ లోక్ సభలో ఆందోళన చేసిన టీడీపీ ఎంపీ ఎన్. శివప్రసాద్ ను రెండు రోజుల పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత సుజనా చౌదరి స్పందిస్తూ, తమ ఎంపీని సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు.  ప్రజాస్వామ్యంలో ఏమీ అగడకూడదా? సభ నడపడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదని దుయ్యబట్టారు. వైసీపీ విడుదల చేసిన పుస్తకాల ఆధారంగా టీడీపీపై కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News