forward castes: అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల నిర్ణయం మంచిదే: ప్రొఫెసర్ కోదండరామ్

  • కానీ, ఇది సాధ్యమయ్యే పని కాదు
  • రాష్ట్రాల అభిప్రాయం కూడా ఉండాలి
  • ఈబీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగేళ్లు ఏం చేశారు?

అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ నిర్ణయం మంచిదే కానీ సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని నిబంధనలు ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇబ్బందేనని, రాజ్యాంగ సవరణ చేస్తే చేయొచ్చు కానీ, ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమయ్యే పని కాదని అన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లపై రాష్ట్రాల అభిప్రాయం కూడా తీసుకోవాలని, ఇది అమలు చేయాలంటే మూడు నెలల సమయం సరిపోదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈబీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.

forward castes
reservations
EBC
prof. kondandaram
telangana jena samithi
constitution
  • Loading...

More Telugu News