imran khan: ఆమె అక్రమాస్తులకు నిజమైన యజమాని ఇమ్రాన్ ఖాన్: ముస్లిం లీగ్ ఆరోపణ ఔరంగజేబ్

  • ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు పీఎంఎల్ కౌంటర్
  • అలీమా అక్రమాస్తులకు ఇమ్రానే యజమాని
  • ఆమె అక్రమాస్తులపై విచారణ ఎందుకు జరగడం లేదు?

అలీమా ఖాన్ అక్రమాస్తులకు నిజమైన యజమాని ఆమె అన్న, ప్రధాని ఇమ్రాన్ ఖానే అని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబ్ ఆరోపించారు. అలీమా అక్రమాస్తులు, మనీలాండరింగ్ అంశాలపై విచారణ ఎందుకు జరగడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, పీఎంల్ లపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీల నేతలకు సంబంధించిన పనామా పేపర్స్, ఫేక్ అకౌంట్స్ కేసులపై సంయుక్త విచారణ బృందాల రిపోర్టులను... దేశం ఎలా నాశనమైంది అనే అంశానికి సంబంధించి కేస్ స్టడీలుగా తీసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. దీనికి ప్రతిస్పందనగా ఇమ్రాన్ పై ఔరంగజేబ్ పైవ్యాఖ్యలు చేశారు.

imran khan
aleema khan
money laundering
illegal property
marriyum aurangzeb
pml n
ppp
  • Loading...

More Telugu News