Andhra Pradesh: 'బీజేపీకి రాజీనామా' వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ!

  • రాజమండ్రి అర్బన్ నుంచి గెలుపొందిన నేత
  • ఢిల్లీకి చేరుకున్న ఆకుల సత్యనారాయణ
  • షాను త్వరలోనే కలుసుకునే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి అర్బన్ స్థానం నుంచి 2014లో గెలుపొందిన బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హైకమాండ్ తో పాటు రాష్ట్ర స్థాయిలో పార్టీ నాయకత్వం వ్యవహారశైలికి వ్యతిరేకంగానే ఆయన బయటకు వెళుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై ఆకుల సత్యనారాయణ స్పష్టత ఇచ్చారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకునేందుకు ప్రస్తుతం తాను ఢిల్లీకి వచ్చానని సత్యనారాయణ తెలిపారు. షా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారనీ, త్వరలోనే ఢిల్లీకి తిరిగివస్తారని వ్యాఖ్యానించారు. ఆయన అపాయింట్ మెంట్ తనకు ఇంకా లభించలేదన్నారు. అమిత్ షాను కలుసుకున్నాక పార్టీ మారడంపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. ఆకుల సత్యనారాయణ త్వరలోనే జనసేనలో చేరుతారని ఇంతకుముందు వార్తలు వచ్చాయి.

Andhra Pradesh
rajamundry
resign
clarity
akula satyanarayana
BJP
Jana Sena
  • Loading...

More Telugu News