yogi adityanath: యూపీ సీఎం యోగి ఆదేశాలు... ఆవుల వెంట పరుగులు పెట్టిన కలెక్టర్, ఎస్పీ!

  • వీధి ఆవులను పట్టుకుని, రక్షణ కల్పించాలంటూ సీఎం యోగి ఆదేశం
  • జనవరి 10వ తేదీ డెడ్ లైన్
  • ఆవులను పట్టుకునే పనిలో బిజీగా వివిధ విభాగాల అధికారులు

రోడ్లపై తిరుగుతున్న వీధి ఆవులను పట్టుకుని, వాటికి రక్షణ కల్పించాలంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన ఆదేశాలతో... వాటిని పట్టుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అమేథిలో ఏకంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా వాటికోసం పరుగులు తీస్తూ కనిపించారు. జనవరి 10వ తేదీ లోగా వీధి ఆవులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇటీవల యోగి ఆదేశించారు. దీంతో, వివిధ విభాగాల అధికారులు ఆవులను పట్టుకునే పనిలో బిజీ అయిపోయారు. పట్టుకున్న ఆవులను వాహనాలలో ఎక్కించుకుని, సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నారు. దీంతోపాటు, వట్టిపోయిన ఆవులను వీధుల్లోకి వదిలేస్తున్న యజమానులకు నోటీసులు ఇస్తున్నారు. 

yogi adityanath
Uttar Pradesh
cow
street
protection
  • Loading...

More Telugu News