Apple: అదరగొట్టే ఫీచర్ తో ఐఫోన్ ఎలెవన్... లీకైన ఫోన్ వీడియో!

  • వెనుకవైపు మూడు కెమెరాలు
  • 3డీ ఇమేజ్ లకు మద్దతిచ్చేలా ఏర్పాటు
  • అధికారికంగా స్పందించని యాపిల్

కొత్త ఐఫోన్ మోడల్ ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా? అని ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎదురు చూస్తుంటారనడంలో సందేహం లేదు. ఇక, ఈ సంవత్సరం సెప్టెంబర్ లో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్న ఐఫోన్ ఎలెవన్ లో అదరగొట్టే ఫీచర్లు ఉన్నాయట. ఈ ఫోన్ కు సంబంధించిన వీడియో ఒకటి లీకై, వైరల్ అవుతోంది. ఇందులో కనిపిస్తున్న ప్రకారం, నూతన మోడల్ లో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నట్టు తెలుస్తోంది. తన తాజా మోడల్ ఐఫోన్ ఎక్స్ ఎస్ లో వెనుక రెండు కెమెరాలు అమర్చిన యాపిల్, కొత్త మోడల్ లో 3డీ ఇమేజ్ లకు మద్దతిచ్చేలా మరో కెమెరాను అమర్చనుంది. ఇప్పటికే పలు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ సంస్థలు 3డీ ఇమేజ్ ఆప్షన్ ను ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజా లీక్ పై యాపిల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.



Apple
IPhone XI
Leak
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News