piyush goyal: ఏపీలో కూడా దుష్టకూటమికి చంద్రబాబు యోచిస్తున్నారు: కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌

  • కాంగ్రెస్‌, టీడీపీలు జతకట్టడాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు
  • ఆంధ్రాలోనూ టీడీపీకి గుణపాఠం తప్పదు
  • విశాఖ రైల్వే జోన్‌ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని వెల్లడి

తెలంగాణలో కాంగ్రెస్‌తో జతకట్టి అట్టర్‌ప్లాప్‌ అయినా, ఏపీలో కూడా అటువంటి దుష్టకూటమి ఏర్పాటుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్‌ కలవడం ఇష్టపడని తెలంగాణ ప్రజలు తగిన బుద్ధిచెప్పి పంపారని, ఆంధ్రాలోనూ బాబుకు గుణపాఠం చెప్పేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీతోనే లాభం ఉంటుందని ఆనాడు అంగీకరించిన టీడీపీ నేతలు ఇప్పుడు హోదా పేరుతో పార్లమెంటు ముందు డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. ప్యాకేజీ ప్రకటించినప్పుడు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేయడం, ఆ తర్వాత మీరు సంబరాలు చేసుకున్న విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు.  విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలిస్తోందని తెలిపారు.

piyush goyal
Chandrababu
Special Category Status
  • Loading...

More Telugu News