YSRCP: తెలంగాణలో నేను దిగుంటే... ఉత్తమ్ గెలిచేవాడు కాదు: వైఎస్ జగన్
- కోమటిరెడ్డి రాజగోపాల్ పరిస్థితి ఏమయ్యేదో
- తెలంగాణ సమస్యలపై పోరాడేందుకు నాకు సమయం దొరకలేదు
- అందుకే తెలంగాణలో పోటీకి దిగలేదన్న వైఎస్ జగన్
తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సహకరించేందుకే వైకాపా పోటీకి దిగలేదని వచ్చిన వార్తలపై వైఎస్ జగన్ తనదైన శైలిలో స్పందించారు. "నేను కనుక పోటీ పెట్టుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచుండేవాడు కాదు. అవునా? కాదా? తెలంగాణలో ఉన్న మా పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి... ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్ స్టెన్సీనే. మేముగన నామినేషన్ వేసుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు. కోమటిరెడ్డి రాజగోపాల్ పరిస్థితి ఏమయ్యేదో నాకు తెలియదు. బేసికల్లీ... వైసీపీ తెలంగాణలో ఎందుకు పెట్టలేదు అంటే, దానికి కారణం క్లియర్ గానే ఎక్స్ ప్లెయిన్ చేస్తాను.
మేము తెలంగాణలో తిరగలా. తెలంగాణలో పార్టీ బలంగా ఉందని మేము అనుకోవడంలా. ఎందుకంటే, అక్కడ ఏ సమస్య వచ్చినా, ఎటుపోయినా, జగన్ స్పందించ లేదు. జగన్ ఎంతసేపూ ఆంధ్రరాష్ట సమస్యలపై స్పందించాడే తప్ప, తెలంగాణ సమస్యల మీద టైమ్ దొరకలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఉన్నాడు. ఆ డ్యూటీ తను చేయలేకపోయాడు. ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి పోయి, పోటీ పెట్టి, ఏమీ చేయకుండా, నిలబడితే ఏమవుతుంది?" అని అన్నారు.
దేవుడు ఆశీర్వదించి, తాను ఏపీలో ముఖ్యమంత్రిని అయితే, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చూస్తానని తెలిపారు. అప్పటికి కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాలన పూర్తి చేసుకుని, ప్రజా వ్యతిరేకత వస్తే, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు.