anushka: సాంగ్స్ రికార్డింగ్ లో అనుష్క మూవీ

  • అనుష్క ప్రధాన పాత్రధారిగా 'సైలెన్స్'
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్ 
  • కీలక పాత్రలో మాధవన్

'భాగమతి' తరువాత అనుష్క మంచి కథల కోసం వెయిట్ చేస్తూ కొంత గ్యాప్ తీసుకుంది. ఇటీవలే హేమంత్ మధుకర్ ఆమెకి ఒక కథను వినిపించగా, ఆమెకి నచ్చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంతో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి అనుష్క పోస్టర్ ఒకటి బయటికి వచ్చింది.

అనుష్క మరింత గ్లామరస్ గా కనిపిస్తోన్న ఆ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన పాటల రికార్డింగ్ ను మొదలుపెట్టేశారు. భాస్కరభట్ల రాసిన ఒక పాటను గోపీసుందర్ రికార్డ్ చేశారు. ఈ పాట చాలా బాగా వచ్చిందని ఆయన చెప్పారు. అనుష్క ప్రధాన పాత్రధారిగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆమె జోడీగా మాధవన్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో అనుష్క మాట .. వినికిడి శక్తి లోపం కలిగిన యువతిగా కనిపించనుందనే ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News