Andhra Pradesh: తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ వేషధారణలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన!

  • పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఆందోళన
  • ప్రత్యేకహోదా, విభజనహామీల అమలుకు డిమాండ్
  • ఆందోళనలో పాల్గొన్న టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈరోజు టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ శివప్రసాద్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ వేషధారణలో పార్లమెంటుకు చేరుకుని నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోదీ మోసం చేశారని ఆయన ఆరోపించారు.

శివప్రసాద్ గతంలోనూ మాయల ఫకీర్, మాజీ సీఎం కరుణానిధి, స్కూలు పిల్లాడు, రావణాసురుడు, సర్దార్ పటేల్, వంగపండు వేషధారణలో పార్లమెంటు వద్ద నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News