Jagan: చంద్రబాబు ముందు చిరంజీవి, మహేశ్ బాబుల నటన దిగదుడుపే!: వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు

  • వారానికో కొత్త స్టోరీ
  • గ్రాఫిక్స్ చూపుతూ సినిమా నటన
  • ప్రజలను మభ్య పెడుతున్న చంద్రబాబు
  • విరుచుకుపడిన వైఎస్ జగన్

రోజుకో డ్రామా ఆడుతూ, వారానికి ఓ కొత్త స్టోరీ చెప్పే చంద్రబాబు ముందు సంవత్సరానికి ఓ సినిమాలో నటించే చిరంజీవి, మహేష్ బాబుల నటన దిగదుడుపేనని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "చిరంజీవి సినిమా సంవత్సరానికి ఒకటి వస్తదేమో. మహేష్ బాబు సినిమా కూడా. కానీ చంద్రబాబునాయుడి పరిస్థితి చూస్తే, లాస్ట్ మూడు నెలల పరిస్థితి చూస్తే...ఎన్నికలు ఆరు నెలల్లో వస్తాయని తెలియగానే... రోజుకో నటన, వారానికో సినిమా.

అయ్యో... పెన్షన్లు రావడం లేదా? నాకు ఇప్పుడే తెలిసింది. వెంటనే పెన్షన్ల మంజూరు. అయ్యో ఇళ్లు రావడం లేదా? నాకు ఇప్పుడే తెలిసింది. వెంటనే ఇళ్లు మంజూరు. పోనీ ఇచ్చారా అంటే అదీ లేదు మళ్లా. అంతా డ్రామా. అయ్యో ప్రత్యేక హోదా ఇంతవరకూ రాలేదా? నాలుగేళ్లయిపోయింది. ఇంతవరకూ ప్రత్యేక హోదా రాలేదా? అంటారు.

నేను ధర్మపోరాట దీక్షలు చేశాను. నువ్వొక సినిమా చూపిస్తావు... రాజధాని... ఇంతవరకూ కట్టడాలు లేవు. అయ్యో బాహుబలి సినిమా, గ్రాఫిక్స్ చూపిస్తారు. పోలవరం... ఇంతవరకూ పునాది గోడదాటి పనులు జరగడం లేదా? అయ్యో... నా మనవడిని కూడా తీసుకుని పోతా. దాని స్పీడ్ పెంచుతా. 2018 కెల్లా నీళ్లు ఇస్తా... రోజుకో సినిమా. రోజుకో డ్రామా.

అసలు రోజుకొక ఇన్నిన్ని కొత్త సినిమాలు ప్రపంచంలో ఎవరూ తీయరు. బీజేపీతో కలుస్తడు. కాంగ్రెస్ తో కలుస్తడు. బీజేపీతో సంసారం చేసేటప్పుడు ఏమంటడు? జగన్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్టు. పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్. ఇప్పుడేమంటడు... ఆయన కాంగ్రెస్ తో కలిశాడు కాబట్టి. జగన్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు అంటున్నడు. కాదా? వాస్తవం లేదా?" అని జగన్ విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News