ajith: తెలుగులోకి అడుగుపెట్టడానికి 'విశ్వాసం' ప్రయత్నం

  • తమిళనాట జనవరి 10న విడుదల
  • తెలుగులో సంక్రాంతి తరువాతే
  • అజిత్ సరసన నాయికగా నయనతార  

శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా 'విశ్వాసం' నిర్మితమైంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించింది. జనవరి 10వ తేదీన ఈ సినిమాను తమిళనాట భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇక తెలుగులో కూడా ఇదే తేదీన రిలీజ్ చేయాలని భావించారుగానీ కుదరలేదు.

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగులో పెద్ద సినిమాలతో పాటు రజనీ సినిమా కూడా రంగంలోకి దిగుతోంది. థియేటర్ల సమస్య తలెత్తుతుందని తెలుగులో 'విశ్వాసం' విడుదలను వాయిదా వేసుకున్నారు. రిపబ్లిక్ డే వీకెండ్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చారనేది తాజా సమాచారం. ఆ దిశగానే గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా జగపతిబాబు కనిపించనున్న సంగతి తెలిసిందే. 

ajith
nayanatara
  • Loading...

More Telugu News