Sultan Muhammad V: 25 ఏళ్ల మాజీ అందాల సుందరిని పెళ్లాడినట్టు వార్తలు.. పదవీ త్యాగం చేసిన 49 ఏళ్ల మలేషియా రాజు

  • మాస్కో అందాల భామ ఒక్సానాను పెళ్లాడినట్టు రూమర్లు
  • రాజు పదవీ త్యాగంతో కలకలం
  • కారణం చెప్పని రాజ ప్రాసాదం

మలేషియా రాజు సుల్తాన్ ముహమ్మద్ V ఆదివారం పదవీత్యాగం చేశారు. బ్రిటన్ నుంచి 1957లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత ప్రస్తుత సుల్తాన్ 15వ రాజు. 49 ఏళ్ల రాజు 25 ఏళ్ల మాజీ మిస్ మాస్కో ఒక్సానా వోవోదినాను పెళ్లాడినట్టు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పదవీ త్యాగం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, పదవి నుంచి రాజు ఎందుకు తప్పుకున్నదీ రాజప్రాసాదం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి వివరణ లేదు.

15వ రాజుగా ముహమ్మద్ తన పదవికి రాజీనామా సమర్పించారని, ఆరో తేదీ నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టు నేషనల్ ప్యాలెస్ ప్రకటించింది. డిసెంబరు 2016లో ముహమ్మద్ సింహాసనాన్ని అధిష్ఠించారు. కాగా, వైద్య చికిత్స నిమిత్తం నవంబరు నుంచి ఆయన సెలవులో ఉన్నారు. కాగా, మాజీ అందాల సుందరి ఒక్సానాను రాజు పెళ్లాడినట్టు వస్తున్న వార్తలపై రాజ ప్రతినిధుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి వివరణ లేదు.

Sultan Muhammad V
Malaysia
abdicated
Britain
Russia
Oksana Voevodina
Moscow
  • Loading...

More Telugu News