Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ తో ‘ఆధార్’ అనుసంధానం తప్పనిసరి చేయబోతున్నాం: రవిశంకర్ ప్రసాద్

  • సంబంధిత బిల్లు పార్లమెంట్ లో పెండింగ్ లో ఉంది
  • ‘ఆధార్’తో లైసెన్స్ అనుసంధానంతో ప్రయోజనం ఉంది
  • డూప్లికేట్, నకిలీ లైసెన్స్ లకు అడ్డుకట్ట వేస్తాం

డ్రైవింగ్ లైసెన్స్ తో ‘ఆధార్’ అనుసంధానాన్ని తప్పనిసరి చేసే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ) లో ఆయన మాట్లాడుతూ, ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో పెండింగ్ లో ఉందని, త్వరలోనే లైసెన్స్ తో ‘ఆధార్’ అనుసంధానం తప్పనిసరి చేయబోతున్నామని అన్నారు. ‘ఆధార్’తో లైసెన్స్ అనుసంధానం వల్ల మంచి ప్రయోజనం వుందని, ఈ పద్ధతి అమల్లోకి వస్తే డూప్లికేట్ లైసెన్స్, నకిలీ లైసెన్స్ లకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. కాగా, పంజాబ్ లోని జలంధర్ లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో ఐఎస్సీ నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News