Pawan Kalyan: కులాల పేరుతో జరిగే గొడవల్లో కొన్ని కుటుంబాలు బాగుపడతాయి: పవన్ కల్యాణ్

  • ఈ తరహా గొడవలతో కులాలు,సమాజం నష్టపోతాయి
  • వ్యక్తిగతంగా, కులాల పరంగా విమర్శలు తగదు
  • రాజకీయాల్లో రాణించాలంటే  ఓపిక, సహనం అవసరం

సిద్ధాంత పరంగా కాకుండా వ్యక్తిగతంగా, కులాల పరంగా విమర్శలు చేయడం సరికాదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కులాల పేరుతో జరిగే గొడవల్లో కొన్ని కుటుంబాలు బాగుపడతాయని, ఈ గొడవల కారణంగా ఆయా కులాలు, సమాజం నష్టపోతాయని అన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే నాయకులకు ఓపిక, సహనం అవసరమని, కొన్నిసార్లు అవమానాలు కూడా భరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, కొత్త రక్తం రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

Pawan Kalyan
jana sena
anantha puram
Vijayanagaram District
politics
Vijayawada
  • Loading...

More Telugu News