ram charan: ‘మై రాం-బో’ అంటూ ఉపాసన ట్వీట్!

  • ‘వినయ విధేయ రామ’ సెట్ లో వీడియో పోస్ట్  
  • మిస్టర్ సి.. నువ్వు నిజమైన హీరో
  • కనల్ కన్నన్ ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రం ట్రైలర్ లోని యాక్షన్ సీన్ లో రామ్ చరణ్ అదరగొట్టాడు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న  ‘వినయ విధేయ రామ’ కోసం తన భర్త రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడని ఉపాసన చెప్పారు. ఈ సినిమా సెట్ లో తీసిన ఓ వీడియోను ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ చిత్రంలో ఓ యాక్షన్ సన్నివేశం కోసం సిద్ధమవుతున్న రామ్ చరణ్ ఈ వీడియోలో కనిపించాడు. కష్టమైన యాక్షన్ సీక్వెన్స్ కు ముందు మై రాం-బో వర్కవుట్ చేశాడని, అప్పుడు, అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పటికీ ఆయన ఒంటిపై చొక్కా లేదని తెలిపారు. ‘మిస్టర్ సి.. నువ్వు నిజమైన హీరో’ అని తన భర్తను ఉపాసన ప్రశంసలతో ముంచెత్తింది. చరణ్ కు కంపెనీ ఇచ్చిన కనల్ కన్నన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఆయన ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయని తన ట్వీట్ లో ఉపాసన కొనియాడారు.

ram charan
upasana
Boyapati Sreenu
kanal kannan
  • Loading...

More Telugu News