Tamilnadu: తమిళనాడు రోడ్డు ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం.. మృతులు మెదక్ వాసులుగా గుర్తింపు

  • పుదుక్కొట్టై సమీపంలో రోడ్డు ప్రమాదం
  • భక్తులు ప్రయాణిస్తున్న వ్యాన్ ని ఢీకొట్టిన కంటైనర్
  • ఈ ఘటనలో పలువురికి గాయాలు

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదిమంది అయ్యప్పభక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన భక్తులు తెలంగాణలోని మెదక్ జిల్లా వాసులుగా గుర్తించారు. రామేశ్వరం నుంచి శబరిమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పుదుక్కొట్టై సమీపంలో అయ్యప్పభక్తులు ప్రయాణిస్తున్న వ్యాన్ ని కంటైనర్ వాహనం ఢీకొట్టింది. ఈ వ్యాన్ లో మొత్తం 16 మంది అయ్యప్పభక్తులు ప్రయాణిస్తున్నారు.

ఈ ఘటనలో పది మంది అయ్యప్పభక్తులు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మెదక్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.
సంఘటనా స్థలంలో ఏడుగురు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు భక్తులు మృతి చెందారు. క్షతగాత్రులను తిరుమయం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, స్థానిక అధికారులు క్షతగాత్రులను పరామర్శించారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tamilnadu
pudukottai
ayyappa devotees
accident
  • Loading...

More Telugu News