Uttam Kumar Reddy: ఉత్తమ్, కుంతియాలు టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారు: సర్వే సత్యనారాయణ ఆరోపణలు

  • కాంగ్రెస్ పార్టీలో రౌడీమూకలు ఉన్నాయి
  • అసలు పార్టీలో ఏం జరుగుతోందో రేపు చెబుతా
  • అర్హత లేని వాళ్లకు ఉత్తమ్ పదవులు ఇచ్చారు

తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా, టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన సర్వే సత్యనారాయణ స్పందించారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలని  ఉత్తమ్, కుంతియాలు కంకణం కట్టుకున్నారని, వీళ్లిద్దరూ టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీలో రౌడీమూకలు ఉన్నాయని, అసలు పార్టీలో ఏం జరుగుతోందో రేపు చెబుతానని అన్నారు. అర్హత లేని వాళ్లకు ఉత్తమ్ పదవులు ఇచ్చారని, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ ను తక్షణం తొలగించాలని ఈ సందర్భంగా సర్వే డిమాండ్ చేశారు. ఉత్తమ్ ను ఇంకా పార్టీ భరించాలా? పార్టీకి నష్టం కలిగించిన వాళ్లే మళ్లీ సమీక్షలు నిర్వహిస్తే ఎలా? అని ప్రశ్నించారు. 

Uttam Kumar Reddy
kuntia
survey satya narayana
TRS
t-congress
Telangana
suspend
  • Loading...

More Telugu News