t-congress: సర్వే సత్యనారాయణ ఓ వీధి రౌడీలా వ్యవహరించారు: టీ-పీసీసీ నేత బొల్లు కిషన్

  • సర్వే నా చొక్కా చింపేశారు
  • ఉత్తమ్, కుంతియాలపై అసభ్యకరంగా మాట్లాడారు
  • తనపై దాడి ఘటనపై స్పందించిన బొల్లు కిషన్

కుంతియా, ఉత్తమ్ లపై అనుచిత వ్యాఖ్యలతో పాటు టీ-పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ పై వాటర్ బాటిల్ విసిరిన కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొల్లు కిషన్ స్పందిస్తూ, ‘నా చొక్కా చింపి.. సర్వే వీధి రౌడీలా వ్యవహరించారు’ అని ఆరోపించారు. ఉత్తమ్, కుంతియాలపై ఆయన అసభ్యకరంగా మాట్లాడారని అన్నారు.

కాగా, సర్వే సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి, పదవులు ఇచ్చిన నేతల పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై అధిష్ఠానం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ ఆయనపై బహిష్కరణ వేటు వేసింది.

ఇదిలా ఉండగా, యూపీఏ హయాంలో కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రిగా సర్వే సత్యనారాయణ పని చేశారు. 2014లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన పోటీచేసి ఓడిపోయారు. 2015 లో వరంగల్ ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓటమిపాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సర్వే ఓటమి పాలయ్యారు. 

t-congress
t-pcc leader
bollu kishan
survey
satya narayana
Uttam Kumar Reddy
kuntia
  • Loading...

More Telugu News