Andhra Pradesh: ఏపీ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తీరును నిరసిస్తూ పార్టీ శ్రేణుల నిరసన

  • గుంటూరులో తాడికొండ టీడీపీ శ్రేణుల సమావేశం
  • తాడికొండలో పార్టీ పరిస్థితిపై చర్చ
  • వచ్చే ఎన్నికల్లో శ్రావణ్ కుమార్ టికెట్ ఇవ్వొద్దని తీర్మానం

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తీరును నిరసిస్తూ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. గుంటూరులోని మౌర్య ఫంక్షన్ హాల్ లో తాడికొండ టీడీపీ శ్రేణుల సమావేశం జరిగింది. జడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాడికొండలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో శ్రావణ్ కుమార్ కు టికెట్ ఇవ్వొద్దంటూ ఈ సమావేశంలో తీర్మానించారు. కాగా, శ్రావణ్ కుమార్ కు వ్యతిరేకంగా పనిచేస్తామని గతంలోనే ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థికి మాత్రమే టికెట్ కేటాయించాలని అధిష్ఠానాన్ని అభ్యర్థించారు.

Andhra Pradesh
Telugudesam
mla sravan kumar
tadikonda
  • Loading...

More Telugu News