New Year: న్యూ ఇయర్ సందర్భంగా పట్టుబడిన మందుబాబులకు షాకిచ్చిన కోర్టులు!

  • డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్
  • పట్టుబడిన 375 మంది
  • 3 నుంచి 16 రోజుల జైలుశిక్ష

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు కొట్టి వాహనాలు నడిపిన వారికి కోర్టులు షాకిచ్చాయి. డిసెంబర్ 31న హైదరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు, తమకు పట్టుబడిన వారిని కోర్టుల ముందు హాజరు పరచగా, 3 నుంచి 16 రోజుల వరకూ జైలు శిక్షలు విధిస్తూ న్యాయమూర్తులు తీర్పిచ్చారు.

 31 రాత్రి మొత్తం 375 మంది డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలి పరిధిలో 74, కూకట్ పల్లి పరిధిలో 79, మాదాపూర్ ప్రాంతంలో 119, బాలానగర్ లో 54, మియాపూర్ తనిఖీల్లో 55 మంది పట్టుబడ్డారు. జైలు శిక్ష పడ్డవాళ్లలో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఇక ఇదే సమయంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి పట్టుబడిన 111 మందికి మాత్రం జరిమానాలు పడ్డాయి.

New Year
December 31
Drunk Driving
Police
Court
  • Loading...

More Telugu News