Sasikala: కాంగ్రెస్ కూటమిలో చేరండి: శశికళను ఆహ్వానించిన విజయశాంతి

  • జైలులో శశికళను కలిసిన విజయశాంతి
  • గంటకుపైగా చర్చలు
  • విజయశాంతి పిలుపునకు సానుకూల స్పందన

కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించిన వేళ.. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ కూటమి బలోపేతానికి కృషి చేస్తున్నారు. వివిధ పార్టీలను కలిసి కాంగ్రెస్ కూటమిలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా, గురువారం బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శశికళను కలిసిన విజయశాంతి కాంగ్రెస్ కూటమిలో చేరాలంటూ ఆహ్వానించారు.

శశికళతో గంటకుపైగా సమావేశం అయిన విజయశాంతి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ‘మహాకూటమి’తో కలిసి రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే, అధిష్ఠానం ఆదేశాల మేరకే శశికళను విజయశాంతి కలిశారా? లేక, ఆమె తనకు తానుగానే వెళ్లి కలిశారా? అన్న విషయంలో స్పష్టత లేదు. విజయశాంతి అభ్యర్థనకు శశికళ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని శశికళ చెప్పినట్టు సమాచారం.

Sasikala
Vijayashanti
Telangana
Congress
Bangalugu
Parappana Agrahara prison
  • Loading...

More Telugu News