Pawan Kalyan: దూకుడు పెంచిన పవన్.. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్!

  • అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలపై నోరు పారేసుకుంటున్నారు
  • మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు
  • ఉన్న చట్టాలను పక్కాగా అమలు చేస్తాం

తాము అధికారంలోకి వస్తే ఏం చేసేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఏపీలో తాము అధికారంలోకి వస్తే మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వారికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మహిళల వంటింటి కష్టాలు తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే, వారి కోసం ప్రత్యేక ఆర్థిక వ్యవస్థను, మహిళా బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.

తాము కొత్తగా చట్టాలు చేయబోమని, ఉన్నవాటినే పకడ్బందీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ‘మహిళల రక్షణ-జనసేన బాధ్యత’ అని పేర్కొన్న పవన్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళల గురించి తప్పుగా మాట్లాడుతున్నా ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాలం కూడా తమకు అనుకూలంగా ఉందని, అందుకే, సామాన్యుల 'గాజు గ్లాస్' జనసేన ఎన్నికల గుర్తుగా వచ్చిందని జనసేనాని పేర్కొన్నారు.

Pawan Kalyan
Andhra Pradesh
Janasena
Mahila bank
Chandrababu
  • Loading...

More Telugu News