Chandrababu: సీఎం చంద్రబాబుతో ముగిసిన హీరో శివాజీ భేటీ

  • చుక్కల భూముల సమస్యలపై సీఎంతో చర్చించా
  • సమస్యను పరిష్కరించకుంటే పోరాటం తప్పదని చెప్పా
  • ఈ నెల 24 లోగా సమస్య పరిష్కరిస్తామని బాబు హామీ

ఏపీ సీఎం చంద్రబాబుతో హీరో శివాజీ భేటీ ముగిసింది. అనంతరం, అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చుక్కల భూముల సమస్యలపై సీఎంతో చర్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజలు చుక్కల భూములతో ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించకపోతే పోరాటం చేస్తానని చెప్పానని అన్నారు.

‘నేను నీకు అవకాశమివ్వను. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చాను’ అని చంద్రబాబు తనతో చెప్పారని పేర్కొన్నారు. ఈ నెల 24 లోగా చుక్కల భూముల సమస్య పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. చుక్కల భూముల సమస్యలను జటిలం చేస్తున్న అధికారుల పేర్లు వెల్లడిస్తానని, తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని శివాజీ తెలిపారు.

Chandrababu
cm
chukkala bhoomulu
hero
shivaji
Andhra Pradesh
amaravathi
  • Loading...

More Telugu News