Indigo: ఇంజిన్ విఫలమై మంటలు, పొగ రావడంతో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- చెన్నై నుంచి కోల్‌కతా బయలుదేరిన విమానం
- టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ విఫలం
- పౌర విమానయాన శాఖ సీరియస్.. విచారణ
ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్ విఫలమవడంతో అత్యవసర ల్యాండింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 3న చెన్నై నుంచి కోల్‌కతా బయలు దేరిన ఏ 320 నియో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పెద్ద శబ్దంతో ఇంజిన్ విఫలమవడంతో పాటు స్వల్పంగా మంటలు, పొగ రావడాన్ని పైలెట్లు గుర్తించారు.
ఆ సమయంలో విమానం బాగా ఊగిపోయినట్టు సమాచారం. దీంతో వెంటనే విమానాన్ని చెన్నైకి మళ్లించి ల్యాండ్ చేశారు. అయితే విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది తెలియరాలేదు. ఈ ఘటనను పౌర విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై విచారణకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి చెందిన బృందం రంగంలోకి దిగింది.