Sekharaiah: కర్ణాటకలో నలుగురు కూతుళ్లు సహా తల్లిదండ్రుల ఆత్మహత్య!

  • భార్యాకూతుళ్లకు విషమిచ్చిన శేఖరయ్య
  • ఉరి వేసుకుని ఆత్మహత్య
  • ఆర్థిక ఇబ్బందులున్నట్టు స్థానిక మీడియా కథనం

అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటకలోని కొప్పాల్ ప్రాంతంలో భార్యాభర్తలు సహా నలుగురు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారని స్థానిక పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. కొప్పాల్‌‌కు చెందిన శేఖరయ్య బీద్నల్(42)... తన భార్య జయమ్మ(39), కూతుళ్లు బసమ్మ(23), గౌరమ్మ(20), సావిత్రి (18), పార్వతి (16)లకు ముందుగా విషమిచ్చి.. అనంతరం అతను ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. పంటలు పండకపోవడంతో బ్యాంకు రుణాలతో శేఖరయ్య కుటుంబం ఇబ్బందులు పడుతోందని ఇరుగు పొరుగు వారు పోలీసులకు చెప్పినట్టు స్థానిక మీడియా ప్రచురించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Sekharaiah
Jayamma
Basamma
Gowramma
Savitri
Parvathi
  • Loading...

More Telugu News