cini industry: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నా: నటుడు ప్రకాశ్ రాజ్

  • స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా
  • అన్ని వివరాలు త్వరలోనే మీడియాకు వెల్లడిస్తా
  • నాకు మద్దతిస్తున్న వారందరికీ అభినందనలు

ప్రముఖ దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగుతానని, కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

తన ఈ కొత్త ప్రయాణానికి మద్దతుగా నిలుస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని, అన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలియజేస్తానని పేర్కొన్నారు. కాగా, ‘సిటిజన్ వాయిస్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక దృక్పథాన్ని చాటుతున్న ప్రకాశ్ రాజ్, ‘జస్ట్ ఆస్కింగ్’ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఓ పౌరుడిగా ఆయన తరచుగా ప్రశ్నలు సంధిస్తున్న విషయం తెలిసిందే.

cini industry
Prakash Raj
paliament elections
bangalore centra
citizen voice
just asking
  • Loading...

More Telugu News